పాకిస్థాన్ దేశం లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కీలక చట్టాన్నీ తీసుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో పాకిస్థాన్ లో మహిళలపై లైంగిక దాడులు విపరీతం గా పెరుగుతన్నాయి. వాటిని అరికట్టడానికి ఇమ్రాన్ ఖాన్ కొత్త చట్టం తీసుకువచ్చింది. ఈ రోజు ఈ చట్టం పార్లమెంట్ ఆమోదం కూడా పొందింది. ఈ కొత్త చట్టం వల్ల మహిళల పై అత్యాచారం చేసిన వారికి కెమికల్ కాస్ట్రేషన్ అని శిక్ష వేస్తారు. కెమికల్ కాస్ట్రేషన్ అంటే వైద్యులు డ్రగ్స్ ఉపయోగించి పురుషులను శృంగారానికి పనికి రాకుండ చేయటం.
ఈ పద్దతిని ఇక నుంచి పాక్ లో ప్రారంభించ నున్నారు. అయితే ఈ కెమికల్ కాస్ట్రేషన్ ను ప్రస్తుతం దక్షిణ కొరియా, పోలాండ్ తో పాటు అమెరికా లోని కొన్ని రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. అయితే రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ చేయడం ఇస్లాం కు, షరియా చట్టాలకు వ్యతిరేకమని జమాత్-ఎ-ఇస్లామి సెనేటర్ ముస్తాక్ అహ్మద్ అన్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆయన నిరసన వ్యక్తం చేశారు.
రేప్ కేసులో దోషులు గా తెలిన వారిని బహిరంగంగా ఉరి తీయాలని ఆయన డిమాండ్ చేశాడు. కానీ ఈ కెమికల్ కాస్ట్రేషన్ గురించి ఇస్లామిక్ చట్టాలలో లేదని అన్నారు. అయితే అత్యాచార దోషులకు ముందు కెమికల్ కాస్ట్రేషన్ చేసిన తర్వాత ఉరి శిక్ష గురించి ఆలోచిద్దామని పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు.