పశ్చిమ హిందూ మహాసముద్రంలో గత కొన్ని వారాలుగా పలు వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారత నౌకాదళం విజయవంతంగా అడ్డుకుంటోంది. తాజాగా సముద్ర దొంగలు హైజాక్ చేసిన ఎంవీ రుయెన్ వాణిజ్య నౌకను పైరేట్ చెర నుంచి విడిపించింది. ఈ దృశ్యాలను భారత నౌకాదళం సోషల్ మీడియాలో షేర్ చేసింది. నౌకలోని 35 మంది సముద్రపు దొంగలను భారత నేవీ ఆధీనంలోకి తీసుకుంది. 17 మంది సిబ్బందిని కాపాడింది.
ఇండియన్ నేవీ అధికారులు భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్‌కతాలో వెళ్లి ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. ఇందులో భాగంగా రవాణా విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్ నుంచి ధైర్యంగా పారాచూట్‌ల సాయంతో సముద్ర ఉపరితలంపైకి నేవీ కమాండోలు దూకి ప్రత్యేకమైన బోట్లలో హైజాక్ అయిన నౌక వద్దకు చేరుకున్నారు.
#WATCH | Airdropping of Marine Commandos and their equipment from a C-17 transport aircraft in the Arabian Sea for action against pirates on a vessel MV Ruen over 2600 km from Indian shores. pic.twitter.com/WoqFWOjJev
— ANI (@ANI) March 17, 2024
ఆ నౌకను దొంగల చెర నుంచి విడిపించింది. రూ.8 కోట్లకుపైగా విలువైన 37,800 టన్నుల సామగ్రితో కూడిన ఆ నౌకను బందీలు, సిబ్బందితో సహా నౌకను ఇండియన్ వెస్ట్‌కోస్ట్ వైపునకు తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు.
#WATCH | A total of 35 Somali sea pirates have been forced to surrender by the Indian Navy by deploying its commandos and other assets. The pirates are being brought to India by the warship INS Kolkata pic.twitter.com/ba3bmdNOOm
— ANI (@ANI) March 17, 2024