హిజాబ్ వివాదం.. 18 రోజుల తర్వాత ఇరాన్‌ నటికి బెయిల్‌

-

హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఇరాన్‌ నటి తరనేహ్‌ అలిదస్తీ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైంది. మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో అలిదస్తీ కూడా పాల్గొంది. ఈ క్రమంలో ఆమెను గత ఏడాది డిసెంబర్​లో పోలీసులు అరెస్టు చేశారు. 18 రోజుల తర్వాత ఆమెకు అధికారులు బెయిల్‌ మంజూరు చేశారు.

2016 ఆస్కార్ గెలుపొందిన ‘ది సేల్స్‌మ్యాన్’ సినిమాలో అలిదస్తీ నటించింది. పలు టీవీ షోలలో కూడా సందడి చేసింది. గతంలో ఇరాన్‌ సినీ పరిశ్రమలో జరిగిన మీటూ ఉద్యమంలో అలిదస్తీ పాల్గొంది. ఆమెను జైలు నుంచి విడుదల చేయాలని ప్రపంచ వ్యాప్తంగా 600 మంది నటీనటులు బహిరంగ లేఖపై సంతకాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version