రగిలిపోతున్న ఇరాన్, హెజ్‌బొల్లా, హమాస్‌.. ఇజ్రాయెల్‌పై దాడులకు సిద్ధం

-

పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్, హమాస్‌ యుద్ధంతో ఇప్పటికే కల్లోలంగా మారిన ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్పై పగ తీర్చుకోవాలని హమాస్, హెజ్బొల్లా, ఇరాన్లు కాచుకు కూర్చున్నాయి. తమ కీలక నేతలను ఇజ్రాయెల్‌ అంతమొందించడంతో రగిలిపోతున్న హమాస్, హెజ్‌బొల్లాలతో, వారిపై దాడులకు తమ భూభాగాన్ని వినియోగించుకోవడంతో ఇరాన్‌ అగ్గిమీద గుగ్గిలమవుతోంది.

ఇజ్రాయెల్పై ఏ క్షణమైనా దాడి జరిగే ఆస్కారం ఉండటమే గాక.. ఈసారి సైనిక స్థావరాలు కాకుండా పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ రక్షక దళం (ఐడీఎఫ్‌) దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు టెల్‌ అవీవ్‌కు అండగా ఉండేందుకు అమెరికా రంగంలోకి దిగి.. పశ్చిమాసియాకు యుద్ధ నౌకలు, ఫైటర్‌ జెట్లను పంపిస్తోంది. వీటితోపాటు బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థతో కూడిన అదనపు క్రూజర్లు, డిస్ట్రాయర్లను పంపించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

మరోవైపు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూపు ఇజ్రాయెల్‌లోని పౌర అవాసాలపై దాడులు చేసే అవకాశముందని ఇరాన్‌ వెల్లడించింది. ఇంకోవైపు హనియా హత్యకు ప్రతీకారంగా దాడులు చేసేందుకు యెమెన్‌లోని హూతీలూ సిద్ధమయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version