ఇజ్రాయెల్-​ హమాస్​ కాల్పుల విరమణ- బందీల విడుదల ప్రారంభం

-

ఇజ్రాయెల్‌-హమాస్​ల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా నిన్నటి నుంచి బందీల విడుదల షురూ అయింది. తొలి విడతలో హమాస్​.. తమ చెరలోని 25 మంది బందీలను విడుదల చేసింది. అందులో ఉన్న 13 మంది ఇజ్రాయెల్ పౌరులను రెడ్​క్రాస్​కు అప్పగించగా వారు రఫా సరిహద్దుకు తరలించి వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఈజిప్టుకు తీసుకెళ్లారు. మరోవైపు మిగిలిన 12 మంది థాయ్​లాండ్ జాతీయులను కూడా హమాస్ విడుదల చేయగా.. వారిని తీసుకెళ్లేందుకు ఆ దేశ రాయబార బృందాలు బయల్దేరినట్లు థాయ్ ప్రధాని స్రెతా థావిసిన్ తెలిపారు.

మరోవైపు ఇజ్రాయెల్‌ కూడా ఒప్పందం ప్రకారం తమ జైళ్లలోని 39 మంది పాలస్తీనా మహిళలు, చిన్న పిల్లలను విడిచిపెట్టినట్లు ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించిన ఖతార్‌ ధ్రువీకరించింది. అయితే వారిని బందీలుగా ఉంచడానికి ఇజ్రాయెల్ కారణం చెప్పింది. జైళ్లలో పెట్టిన వారిలో చాలా మంది ఇజ్రాయెల్‌ సైన్యంపై రాళ్ల దాడులు చేసినవారే ఉన్నారని వెల్లడించింది. తమ ప్రభుత్వం బందీలందర్నీ విడిపించడానికి కట్టుబడి ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version