మరోసారి నోరు జారిన బైడెన్.. ఐర్లాండ్‌ పర్యటనలో గందరగోళం

-

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మరోసారి నియంత్రణ కోల్పోయారు. తాజాగా ఐర్లాండ్ పర్యటనలో బైడెన్ నోరుజారారు. న్యూజిలాండ్‌కు చెందిన రగ్బీ బృందం.. 1920లో ఐరిష్‌ ప్రజలపై అరాచకాలకు పాల్పడిన బ్రిటిష్‌ పోలీసులకు మధ్య తేడాను మర్చిపోయారు. ఐర్లాండ్‌లోని డుండల్క్‌ విండ్‌సోర్‌ బార్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా తన ఐదో కజిన్‌, అంతర్జాతీయ రగ్బీ ఆటగాడు రాబ్‌ కియార్నె గురించి మాట్లాడుతూ.. ‘‘అతడు భీకరమైన ఆటగాడు. అతడు ‘బ్లాక్‌ అండ్‌ టాన్స్‌’ను ఓడించాడు’’ అని పేర్కొన్నారు. ఈ మాటలతో అక్కడున్న ప్రేక్షకులు అవాక్కైపోయారు. ఆ తర్వాత బైడెన్‌ ఆ మాటను సవరించుకొన్నారు.

 

తన కజిన్‌ రాబ్‌ ఓ టైను బహూకరించిన సందర్భాన్ని బైడెన్‌ గుర్తు చేసుకొనే సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. వాస్తవానికి 2016లో జరిగిన ఓ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 111ఏళ్లలో తొలిసారి న్యూజిలాండ్‌కు చెందిన ఆల్‌ బ్లాక్‌ రగ్బీ బృందాన్ని ఓడించింది. ఆ సమయంలో రాబ్‌ ఓ టైను బైడెన్‌కు ఇచ్చారు. నాటి ఘటనను గుర్తు చేసుకొనే సమయంలో ఈ పొరబాటు దొర్లింది.

ఇక ‘బ్లాక్‌ అండ్‌ టాన్స్‌’ అనేది ఐరిష్‌ ప్రజలను అణచివేసేందుకు బ్రిటన్‌ నియమించి పోలీస్‌ దళం నిక్‌నేమ్‌. దాదాపు 100 ఏళ్లపాటు జరిగిన ఐరిస్‌ స్వాతంత్య్ర  పోరాట సమయంలో ఆ దళం ప్రజలు, రిపబ్లికన్లపై తీవ్రమైన అరాచకాలకు పాల్పడింది. ఈ దళం యూనిఫామ్‌ ఆధారంగా ఆ పేరు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version