వాటి కోసమైన మళ్లీ ఇండియాకు వస్తా: జాన్‌ సీనా

-

హాలీవుడ్‌ యాక్టర్, డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ జాన్‌ సీనా జులైలో అంబానీ ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ముంబయిలో ఉండగా.. భారతీయ సంస్కృతి గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడి వంటకాలను రుచి చూశారు. అయితే మరోసారి తాను ఇండియాకు రావాలనుకుంటున్నానని జాన్ సీనా అన్నారు.

అంబానీ ఇంట్లో జరిగిన వివాహ వేడుకలో అన్ని రకాల వంటకాలకు వడ్డించారని.. భారత రుచులను కూడా చూపించారని జాన్ సీనా చెప్పారు. అవి చాలా అద్భుతంగా ఉన్నాయని.. మళ్లీ వెళ్లి మరిన్ని భారత వంటకాలను రుచి చూడాలని ఉందని తెలిపారు. మసాలా, కారం చెమటలు పట్టించే స్థాయిలో ఉన్నా వాటిని ఆస్వాదించడంలో తన సామర్థ్యమెంటో మరోసారి భారత్‌కు వచ్చినప్పుడు టెస్ట్ చేయాలనుకుంటున్నానని జాన్ సీనా చెప్పారు. అందుకోసమైనా త్వరలో భారత్‌కు రావాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. ఇక అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహానికి జాన్‌ సీనా భారతీయ వస్త్రధారణలో హాజరయ్యారు. పౌడర్‌ బ్లూ రంగులో ఉన్న సంప్రదాయ షేర్వాణీని ధరించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version