రైల్లో రష్యాకు బయల్దేరిన కిమ్.. పుతిన్​తో భేటీ!

-

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అవ్వనున్నారు. ఇందుకోసం ఆయన తన విలాసవంతమైన రైల్లో రష్యాకు బయల్దేదారు​. తన వ్యక్తిగత విలాసవంతమైన రైల్లో.. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌ నుంచి ఆదివారం మధ్యాహ్నం రష్యాకు పయనమైనట్లు ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. కాగా మంగళవారం రోజున పుతిన్​తో కిమ్‌ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కొంత కాలంగా ఉక్రెయిన్​పై భీకర పోరు సాగిస్తున్న రష్యా.. ఆయుధాలను సమీకరించే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కిమ్ రష్యాలో పర్యటించే అవకాశాలున్నాయని అమెరికా నిఘావర్గాలు ఇటీవల అంచనా వేశాయి. గత నెలలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉత్తర కొరియా వెళ్లారని.. క్రెమ్లిన్‌కు ఆయుధాలు విక్రయించేలా చర్చలు జరిపారని వెల్లడించాయి. ఈ క్రమంలోనే కిమ్ తన ప్రత్యేక రైల్లో రష్యాకు వెళ్లారని స్థానిక మీడియాతోపాటు జపాన్‌ న్యూస్‌ ఏజెన్సీలోనూ కథనాలు వెలువడ్డాయి. ఇదే విషయాన్ని మాస్కో అధికారులు కూడా ధ్రువీకరించినట్లు తెలిపాయి. అయితే, దీనిపై దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం, రక్షణశాఖ, అక్కడి నిఘా వర్గాలు ఎటువంటి ప్రకటన చేయలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version