ఇవాళ చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ !

-

ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాకాత్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం స్నేహ బ్లాక్ లో చంద్రబాబుకు ఒక సహాయకుడు, ఐదుగురు జైలు భద్రత సిబ్బంది ఉంది. యోగా, వాకింగ్ అనంతరం జైలు గదిలోనే ఉంటున్నారు చంద్రబాబు. అటు చంద్రబాబుకు ఇంటి భోజనం తీసుకెళ్తున్నాడు వ్యక్తిగత సహాయకుడు.

Family members meeting with Chandrababu today

అంతేకాదు… సెంట్రల్ జైలు సమీపంలోని విద్యానగర్ లో బస చేశారు నారా లోకేష్. ఇక ఇవాళ చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాకాత్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా.. టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ నేటికి మూడో రోజుకు చేరుకుంది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. ఇక ఇవాళ నేడు టిడిపి నేతలు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనుంది టీడీపీ పార్టీ. చంద్రబాబు అరెస్టుపై భవిష్యత్ కార్యాచరణలపై చర్చ నిర్వహించనున్నారు. చంద్రబాబు హౌస్ రిమాండ్ పై ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version