కువైట్ లోని వీసా ఉల్లంఘనదారులకు శుభవార్త…!

-

కువైట్ లోని వీసా ఉల్లంఘనదారులకు శుభవార్త చెప్పడం జరిగింది. ఈ నెల 31తో ముగియనున్న గ్రేస్ పీరియడ్‌ లో మార్పులని చేయడం జరిగింది. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ మంత్రి థామెర్ అల్ అలీ సభా గ్రేస్ పీరియడ్‌ను మార్చి 2 వరకు పొడిగిస్తున్నట్లు చెప్పడం జరిగింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే…

kuwait

ఫిబ్రవరి 1 నుంచి మార్చి 2 వరకు ఈ గ్రేస్ పీరియడ్ అమలులో ఉంటుందని అంతర్గత మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. కరోనా కారణంగా రెండు వారాల పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం కలగడం వలనే ఇలా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అని అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ చెప్పిన దరిమిలా మరోసారి గ్రేస్ పీరియడ్‌ను పెంచినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ పేర్కొంది.

కరోనా ప్రభావం ప్రారంభమైన 2020 మార్చి నుంచి ఇప్పటి వరకు పలుమార్లు గ్రేస్ పీరియడ్‌ను పొడిగించిన సంగతి తెలిసినదే. అయితే మొదటి సారి గ్రేస్ పీరియడ్ ని మే వరకు పెంచగా… మరో రెండు సార్లు కూడా పెంచడం మనకి తెలిసినదే. ఇవన్నీ ఇలా ఉంటె డిసెంబర్‌ లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రి థామెర్ అల్ అలీ సభా ఈ గ్రేస్ పీరియడ్‌ను తాజాగా జనవరి 31 వరకు పొడిగించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version