ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ హతం అయినట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు స్థావరాలపై దాడులు మొదలుపెట్టింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహ్మద్ బగేరీ మృతి చెందినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే.. ఈ విషయాన్ని ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు ఇరాన్.

అటు అర్ధరాత్రి నుంచే ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి జరిగింది. ఇరాన్ అణు స్థావరాలపై మిస్సైళ్లతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. రాజధాని టెహ్రాన్‌లో ఉన్న పలు అణు స్థావరాలపై దాడులు జరిగాయి. ఇరాన్‌పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించామని పేర్కొన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతనాహ్యు.