ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొబ్బర్ నియమితులయ్యారు. సుప్రీం లీడర్ ఆయతోల్లా అలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ తాజాగా హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మొఖ్బర్ను తాత్కాలిక దేశాధ్యక్షుడిగా నియమించారు. రైసీ సంతాప సందేశంలో అలీ ఖమేనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా దేశంలో ఐదు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.
ఇస్లామిక్ రిపబ్లిక్ రాజ్యాంగం ప్రకారం ఇరాన్ అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని చేపడతారు. దీనికి దేశ సుప్రీంలీడర్ ఖమేనీ ఆమోద ముద్ర అవసరం. అనంతరం ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ స్పీకర్, న్యాయ విభాగాధిపతితో కూడిన ఓ కౌన్సిల్ను ఏర్పాటుచేస్తారు. ఈ క్రమంలోనే 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి
ఉంటుంది.