జపాన్​ ప్రధాని ఫ్యూమియో కిషిదతో మోదీ భేటీ

-

మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల కోసం టోక్యో వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. జపాన్​ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదతో సమావేశమయ్యారు. పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ.. మాజీ ప్రధాని షింజో అబేతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

జపాన్​ మాజీ ప్రధానమంత్రి షింజో అబే మరణం విషాదకరమని, వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్నారు నరేంద్ర మోదీ. గతంలో తాను జపాన్​కు వచ్చినప్పుడు చాలా సమయం మాట్లాడకున్నామని చెప్పారు. అబే.. భారత్​, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను​ మరో ఎత్తుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మైత్రి బలోపేతానికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత ప్రధాని ఫ్యుమియో కిషిద సైతం అదే తీరును కొనసాగిస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు మోదీ. అబే అంత్యక్రియల కోసం జపాన్​కు వచ్చిన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు కిషిద.

Read more RELATED
Recommended to you

Exit mobile version