BREAKING : నేపాల్‌లో భూకంపం.. 69 మంది మృతి

-

నేపాల్​లో భారీ భూకంపం పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు దాదాపు 69 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. నేపాల్‌లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత జాజర్​ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు తెలిపింది.

ప్రజలంతా నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి కావడం వల్ల పలు ప్రాంతాలతో కమ్యూనికేషన్‌ తెగిపోయిందని.. దీనివల్ల తొలుత ప్రమాద తీవ్రత తెలియలేదని అధికారులు చెప్పారు. ప్రతికూల పరిస్థితుల మధ్యే సహాయ చర్యలు చేపట్టామని.. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. భూకంపం ధాటికి రుకుం జిల్లాలో 35 మందికి పైగా మరణించారని, అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని.. జాజర్‌కోట్ జిల్లాలో 34 మంది మరణించారని అధికారుుల తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version