నేడు మేడిగడ్డను సందర్శించనున్న బీజేపీ ప్రతినిధి బృందం

-

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఇప్పుడు రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార బీఆర్ఎస్​పై ఇదే అంశాన్ని అస్త్రంగా మలుచుకుని ప్రచారం చేస్తున్నాయి ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఇటీవలే ఈ బ్యారేజీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సందర్శించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈరోజు బీజేపీ నేతలు మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నారు.

కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితోపాటు ఆ పార్టీ నేతలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, రఘనందన్ రావులు మేడిగడ్డకు వస్తున్నారు. 20వ పిల్లర్ వద్ద బ్యారేజీ కుంగిన ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. బ్యారేజీ పటిష్టత, భద్రత తదితర విషయాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. గత నెల చివరి వారంలో వచ్చిన కేంద్ర బృందం… బ్యారేజీకి సంబంధించి అడిగిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదని.. హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఉదయం పదిగంటలకు బీజేపీ నేతలు బయలుదేరనున్నారు. 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు.  మేడిగడ్డ పర్యటన ముగించుకుని మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version