పవర్​ఫుల్ మిసైల్​ను పరీక్షిస్తూ.. అమెరికాకు కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్

-

ఉత్తర కొరియా మరోసారి అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని మళ్లీ మళ్లీ పరోక్షంగా హెచ్చరించింది. ఈసారి ఏకంగా తమ వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. ‘ది కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌’ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది.

ఘన ఇంధన మోటార్ల ఆధారంగా ఈ క్షిపణి పనిచేస్తుందని న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ పరీక్ష తమ ప్రత్యర్థుల్లో తీవ్రమైన భయాన్ని, ఆందోళనను సృష్టించిందని ఉ.కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పేర్కొన్నట్లు సమాచారం. ఈ క్షిపణి పరీక్షను కిమ్‌ తన కుమార్తె, భార్య, సోదరితో కలిసి పర్యవేక్షించడం గమనార్హం.

నిన్న హ్వాసాంగ్‌-18 అనే క్షిపణిని ఉ.కొరియా పరీక్షించినట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగం ద్వారా క్షిపణిలోని ఘన ఇంధన మల్టీస్టేజ్‌ మోటార్‌ సామర్థ్యాన్ని అంచనా వేశారు. ముఖ్యంగా వివిధ దశల్లో క్షిపణిలోని భాగాలు విడిపోవడాన్ని.. నియంత్రణ వ్యవస్థలను పరీక్షించారు. ఘన ఇంధన మోటార్లు వినియోగించిన ఖండాంతర క్షిపణిని ఆ దేశం పరీక్షించడం ఇదే తొలిసారి. గతంలో ఈ మోటర్లతో స్వల్పశ్రేణి క్షిపణలను పరీక్షించింది. ఈ టెక్నాలజీ విజయవంతమైతే అమెరికాపై ఎటువంటి హెచ్చరికలు లేకుండా నిమిషాల వ్యవధిలోని ఉ.కొరియా దాడి చేసే అవకాశం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version