భారత్‌-రష్యా మైత్రి కొత్త పుంతలు తొక్కుతోంది: మోదీ

-

రష్యాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయులనుద్దేశించి మాస్కోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన భారత్-రష్యా మైత్రి కొత్త పుంతలు తొక్కుతోందని తెలిపారు. భారత్‌ కష్టసుఖాల్లో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని పేర్కొన్నారు. భారత్-రష్యా మైత్రి పురాతనం, భావోద్వేగభరితం అని వ్యాఖ్యానించారు. రాజ్‌కపూర్‌ సినిమాలోనూ రష్యాతో స్నేహంపై పాట ఉందని గుర్తు చేశారు. పుతిన్‌తో ఇప్పటివరకు 17 సార్లు భేటీ అయ్యానని మోదీ చెప్పుకొచ్చారు.

ఉన్నత విద్యకోసం భారతీయులు రష్యా వస్తున్నారన్న ప్రధాని మోదీ.. భారత్ అభివృద్ధిని చూసి ఎన్‌ఆర్‌ఐలు గర్వపడుతున్నారని పేర్కొన్నారు. రష్యాలో మరో రెండు కాన్సులేట్‌ కార్యాయాలు ప్రారంభిస్తామని తెలిపారు. భారత్‌ ఘనతను ప్రపంచం గుర్తించక తప్పని పరిస్థితి తెచ్చామన్న మోదీ.. దేశంలోని ప్రతిఒక్కరిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నామని వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్యబీమా వ్యవస్థ భారత్‌లో ఉందని వెల్లడించారు.

‘ఆత్మవిశ్వాసం భారత దేశానికి అతిపెద్ద ఆయుధం. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పటిష్ఠమైంది. మన దేశ యువతే.. మన నిజమైన ఆస్తి. ప్రపంచ అభివృద్ధి అధ్యాయాన్ని భారత్‌ లిఖిస్తోంది. గత పదేళ్లలో భారత్ విజయాలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. గత పదేళ్లలో భారత్‌లోని విమానాశ్రయాలు రెట్టింపయ్యాయి. గత పదేళ్లలో 40 వేల కి.మీ. రైల్వే లైన్లు విద్యుదీకరించాం.’ అని మోదీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version