మోదీ.. మోదీ.. నామస్మరణతో మార్మోగిన అమెరికా కాంగ్రెస్ సభ

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం రోజున వాషింగ్టన్ చేరుకున్న మోదీకి అధ్యక్ష దంపతులు జో బైడెన్-జిల్ బైడెన్​లతో పాటు ప్రవాస భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అధ్యక్ష దంపతులతో మోదీ కాసేపు భేటీ అయ్యారు.

ఇక అనంతరం మోదీ అమెరికా కాంగ్రెస్‌ సభలో చరిత్రాత్మక ప్రసంగం చేశారు. ఇది యుద్ధాల యుగం కాదని మరోసారి బహిరంగంగా చెబుతున్నానని స్పష్టం చేశారు. ప్రతీదేశం సార్వభౌమాధికారం, సమగ్రతను గౌరవించాలని.. భారత్‌ పెద్దగా ఎదగడమే కాకుండా తొందరగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. భారతదేశం అభివృద్ధి చెందితే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం ఇప్పటికీ ప్రమాదకరంగా ఉందని.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవాలిని అన్నారు. మోదీ ప్రసంగం ఆద్యంతం సభ చప్పట్లతో మార్మోగింది. మోదీ.. మోదీ.. అంటూ అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు నినదించారు.

అనంతరం వైట్‌హౌస్‌లో బైడెన్‌ దంపతులు ఏర్పాటు చేసిన స్టేట్‌ డిన్నర్‌కు మోదీతోపాటు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌, అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌ హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version