ఉక్రెయిన్​పై రష్యా మిస్సైల్ అటాక్.. నలుగురు మృతి

-

ఓవైపు వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు చేపట్టినా.. రష్యా మాత్రం ఉక్రెయిన్​పై తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ఇక వాగ్నర్ గ్రూప్ సమస్య పరిష్కారమైన తర్వాత మరింతగా విరుచుకు పడింది. తాజాగా ఉక్రెయిన్​పై రష్యా మరోసారి క్షిపణితో దాడి చేసింది రష్యా. ఈ దాడిలో ఓ చిన్నారి సహా నలుగురు మరణించారు. పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తర ఉక్రెయిన్​లోని క్రామటోస్క్​ మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు మిలిటరీ అధికారులు వెల్లడించారు. ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో క్షిపణి దాడి చేశారని వారు వివరించారు. దీనిపై సమాచారం అందుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందడం మరింత బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు.

ఏడాదికి పైగా రష్యా సేనలు ఉక్రెయిన్​పై విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఇటువైపు ఉక్రెయిన్ సేనలు.. మరోవైపు రష్యా సైనికులు పెద్ద సంఖ్యలో మరణించారు. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version