అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ లో మరోసారి బాంబు దాడి కలకలం రేపింది. బాంబు దాడితో రాజధాని నగరం మరోసారి అట్టుడికింది. ఓ మసీదుకు సమీపంలో జరిగిన పేలుడులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 41మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుళ్ల అనంతరం.. ఘటనాస్థలిలో దట్టంగా పొగలు అలుముకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
మసీదులో ప్రార్థనలు ముగించుకొని బయటకు వెళ్లే వారు లక్ష్యంగా బాంబు పేలుడు జరిగినట్లు కాబూల్ పోలీసు చీఫ్ ఖలీద్ జద్రాన్ తెలిపారు. దాడులకు సంబంధించి.. ముమ్మర దర్యాప్తు జరుగుతున్నట్లు తాలిబన్ల ప్రభుత్వ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.