పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త..జగన్ కు బాలయ్య వార్నింగ్

-

వైసీపీ వాళ్లవి..సిగ్గులేని బతుకులు అని నందమూరి బాలయ్య విమర్శలు చేశారు. ఎన్టీఆర్‌ యూనివర్సీటీ పేరు మార్చడంపై తాజాగా బాలయ్య తాజాగా స్పందించారు. మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు..ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక అన్నారు. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు.. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడని నిప్పులు చెరిగారు.

మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు…… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు బాలయ్య. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయని చురకలు అంటించారు. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version