ఓ విమానం గాల్లో ఉండగానే అందులోని ఓ వ్యక్తి అత్యవసర ద్వారాన్ని పాక్షికంగా తెరవడం తీవ్ర కలకలం రేపింది. క్యాబిన్‌లోకి భారీగా గాలి వీయడంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. చివరకు విమానం సురక్షితంగా దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏసియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం శుక్రవారం దక్షిణ కొరియాలోని జెజూ ద్వీపం నుంచి డెయగూ నగరానికి 194 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 194 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానంలో జెజూ ద్వీపం నుంచి డెయగూ నగరానికి బయల్దేరింది. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు యత్నించాడు. తోటి ప్రయాణికులు వారించినా వినలేదు. వారు అతడిని ఆపేలోగానే.. డోర్ తెరుచుకుంది. ఒక్కసారి విమానంలోకి గాలి చొరబడటం వల్ల ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. ఎట్టకేలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
విమానం ల్యాండ్ అయిన తర్వాత డోర్ తెరిచిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించారు. విచారణలో అతడు ఎనర్జెన్సీ డోర్ తెరవడం వెనుక కారణం తెలిసిరాలేదు. అస్వస్థతకు గురైన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించామని ఏసియానా ఎయిర్ లైన్స్ వెల్లడించింది.