Sri Lanka Crisis: అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కీలక ప్రకటన… వారం రోజుల్లో కొత్త ప్రధాని, మంత్రి వర్గం

-

ద్వీప దేశం శ్రీలంక రావణకాష్టంగా రగులుతూనే ఉంది. తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసరాల ధరలు పెరిగి పోవడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. రాజపక్సే కుటుంబీకులు అధ్యక్ష, ప్రధాని పదవుల నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని మహిందా రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే గత రెండు రోజుల నుంచి శ్రీలంకలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనల్లో 8 మంది వరకు మరణించగా… 200 మంది వరకు గాయపడ్డారు. 

ఈ నేపథ్యంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో  కొత్తగా మంత్రి వర్గాన్ని, కొత్త ప్రధానిని నియమిస్తున్నట్లు ప్రజలకు తెలిపాడు. ఇప్పటికే అఖిల పక్ష సర్కార్ ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలను అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కోరినా… అందుకు ప్రతిపక్షాలు నిరాకరించాయి. ఈ నేపథ్యంలో  కొత్తగా ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే రాజధాని కొలంబోలో విధించిన కర్ఫ్యూను కొన్ని గంటల పాటు సడలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version