T20 వరల్డ్ కప్ విజయం.. ఇండియాపై అక్కసు వెళ్లగక్కిన ఆస్ట్రేలియా పత్రిక

-

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టైటిల్ సొంతం చేసుకున్న భారత క్రికెట్‌ జట్టుపై అంతర్జాతీయ మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. ‘గేరు మార్చి భారత్‌కు కప్పు అందించిన కోహ్లీ’ అంటూ లండన్‌ సండే టైమ్స్‌ కథనం పేర్కొనగా.. ‘ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరై భారత్‌కు కప్పు అందజేసిన దక్షిణాఫ్రికా’ అంటూ టెలిగ్రాఫ్‌ పత్రిక కథనం ప్రచురించింది. ఇక పాకిస్థాన్‌కు చెందిన డాన్‌ పత్రిక టీమిండియా సెలబ్రేషన్ ఫొటోను మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించి కోహ్లీ ఆటతీరును కొనియాడింది. మరోవైపు ‘ఒత్తిడిలోనూ రాణించి కప్పు గెలిచిన భారత్‌’ అంటూ ఆస్ట్రేలియాకు చెందిన ‘క్రికెట్‌.కామ్‌.ఏయూ’ మ్యాచ్‌ రిపోర్టును రాసింది.

అయితే వీటన్నింటికి భిన్నంగా ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ మాత్రం భారత్పై అక్కసు వెళ్లగక్కింది. ‘‘టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను టాప్‌లో నిలబెట్టిన దక్షిణాఫ్రికా తడబాటు’’ అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించి భారత్ విజయాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేసింది. ‘‘ప్రపంచ క్రికెట్‌ దిగ్గజం భారత జట్టుకు టీ20 వరల్డ్‌ కప్‌లో అన్నీ అనుకూలించాయి. దక్షిణాఫ్రికా కుప్పకూలడం, అంపైర్ల నిర్ణయాలతో ఎట్టకేలకు రోహిత్‌ సేన కప్పు గెలిచింది’’ అంటూ సిడ్నీ మార్నింగ్‌ పత్రిక రాసుకొచ్చింది. సూపర్‌-8 మ్యాచ్‌లో భారత టీమ్‌ ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ విజయాన్ని నమోదు చేయడం జీర్ణించుకోలేకే ఆ పత్రిక అక్కసు వెళ్లగక్కిందని క్రీడానిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version