బ్రిటన్ లో లేబర్ పార్టీకే ప్రజల మద్దతు.. ఓటమి అంచున రిషి సునాక్?

-

ఐదేళ్ల తర్వాత తొలిసారి సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనున్న యునైటెడ్ కింగ్‌డమ్‌లో 14ఏళ్లుగా కన్జర్వేటివ్‌ పార్టీనే అధికారంలో ఉంది. కానీ ఈసారి ఈ పార్టీ ఎదురీదుతోందనే అంచనాలు అధికార పక్ష నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు అధికారం చేపట్టిన కన్జర్వేటివ్‌ పార్టీ మరో మూడు ఎన్నికల్లోనూ గెలిచినా ఈ కాలంలో యూకే ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, వరుస కుంభకోణాలు విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలో సర్‌ కీర్ స్టార్మర్‌ నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం లేబర్‌ పార్టీ ఒపీనియన్ పోల్స్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీకంటే చాలా ముందుంది. మార్పు అనే ఒకే నినాదంతో లేబర్‌ పార్టీ ఎన్నికల ప్రచారం చేస్తూ దూసుకెళ్తోందని ఈ సర్వే తెలిపింది. అధికార పార్టీ ఇమిగ్రేషన్ విధానంపై విమర్శలు చేస్తున్న “ది న్యూ రిఫార్మ్‌ పార్టీ” మితవాద కన్జర్వేటివ్‌ల ఓట్లను లాగేసుకునే పరిస్థితి కనిపిస్తోందని ఈ సర్వేలో తేలినట్లు సమాచారం. యూకేలో కన్జర్వేటివ్ పార్టీ కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లోనూ అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. మూడు దశాబ్దాలుగా కన్జర్వేటివ్ పార్టీని గెలిపించిన ఓటర్లు ఈసారి మార్పును కోరుకుంటున్నట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version