కల్వకుంట్ల కవిత కేసులో ట్విస్ట్..నేడు రిలీజ్‌ కాబోతున్నారా?

-

కల్వకుంట్ల కవిత కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నేడు కల్వకుంట్ల కవిత రిలీజ్‌ కాబోతున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. లిక్కర్ ఈడి కేసులో నేటితో ముగియనున్న కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది.

kavitha case on july 3rd

దీంతో ఇవాళ ట్రయల్ కోర్టులో కల్వకుంట్ల కవిత ను హాజరు పర్చనున్నారు తీహార్ జైలు అధికారులు. మార్చి 15 న లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత ను అరెస్ట్ చేసిన ఈడి…అప్పటి నుంచి రిమాండ్‌ లో ఉంచింది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత…ట్రయల్ కోర్టు ముందుకు వెళతారు.

దీంతో నేడు కల్వకుంట్ల కవిత రిలీజ్‌ కాబోతున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక మొన్న లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టులో మరోసారి చుక్కెదురు అయింది. కవిత బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. కవితకు బెయిల్ ఇవ్వద్దనే సీబీఐ, ఈడీ వాదనలతో కోర్టు ఏకీభవించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version