నెతన్యాహు ఉచ్చులో పడొద్దు.. అమెరికాకు ఇరాన్‌ మెసేజ్‌

-

‘‘అమెరికా జాగ్రత్త..  నెతన్యాహు ఉచ్చులో పడొద్దు.’’ అంటూ ఇరాన్ అమెరికాకు ఓ సందేశం పంపింది. సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయ కాన్సులర్‌ విభాగంపై జరిగిన గగనతల దాడిలో ఏడుగురు అధికారులు మృతి చెందగా.. వారిలో ఇరాన్‌ సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్‌పై  ఇరాన్ ఏక్షణమైనా దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పై ప్రతిదాడి విషయంలో అమెరికా దూరంగా ఉండాలని తాము అడిగినట్లు ఇరాన్‌ తెలిపింది.

‘‘అమెరికా జాగ్రత్త..  నెతన్యాహు ఉచ్చులో పడొద్దు. ఈ విషయంలో మీరు దూరంగా ఉండాలి.. అలా అయితే మీపై దాడి జరగదు’’ అని వాషింగ్టన్‌కు సందేశం పంపినట్లు ఇరాన్ ఉన్నతాధికారి మహమ్మద్‌ జంషిది వెల్లడించారు. అయితే దీనిపై అమెరికా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఈ ఉద్రిక్తతల వేళ.. అమెరికా హై అలర్ట్‌లో ఉందని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇజ్రాయల్‌లో దాడి జరగొచ్చని, అది నిఘా, మిలిటరీ స్థావరాల లక్ష్యంగా ఉండొచ్చని జో బైడెన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version