త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు, తన వ్యక్తిగత జీవితం గురించి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ఒకానొక దశలో తనకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చినట్లు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆ పరిస్థితికి గల కారణాం గురించి బైడెన్ ఇలా చెప్పారు.
1972లో జరిగిన కారు ప్రమాదంలో నా మొదటి భార్య, కుమార్తె మరణించారు. ఆ ఘటన తర్వాత నేను మానసికంగా కుంగిపోయాను. ఆ సమయంలో మందుకు అలవాటుపడ్డా. బ్రిడ్జి మీదకు వెళ్లి, దూకాలనే ఆలోచనలు వెంటాడేవి. కానీ అప్పుడు వెంటనే నా ఇద్దరు కుమారులు గుర్తొచ్చేవారు. అని బైడెన్ తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య వంటి పిచ్చి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఈ ప్రమాదం తర్వాత బైడెన్ ఒంటరిగా తన ఇద్దరు పిల్లల సంరక్షణ చూసుకున్నారు. కొద్దికాలానికి జిల్‌తో పరిచయం ఏర్పడింది. ఇక ఇంటర్వ్యూలోనే మాజీ అధ్యక్షుడు, తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో చర్చకు సిద్ధమని బైడెన్ వెల్లడించారు. దానికి ట్రంప్ సమాధానం ఇస్తూ.. ‘‘ఎక్కడైనా, ఎప్పుడైనా ఓకే’’ అంటూ బదులిచ్చారు.