అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అధ్యక్షుడు స్వల్ప దగ్గు, జలుబు, సాధారణ అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం బైడెన్ డెలావేర్‌లోని సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటూ కొవిడ్ మందులు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వెగాస్‌లో ప్రచారంలో ఉన్న బైడెన్‌కు కొవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో వెంటనే ఇంటికి చేరుకున్నారు. తను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. బైడెన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే అధ్యక్ష బరి నుంచి వైదొలిగేందుకు ఆలోచిస్తానని ప్రకటించడం చర్చనీయాంశమైంది. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన ఆనారోగ్యానికి గురి కావడం గమనార్హం. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలగాలని ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్‌కు స్వపక్షం నుంచి వస్తున్న వ్యతిరేకత రోజు రోజుకూ పెరుగుతోంది.