అమెరికా అభ్యర్థిత్వ రేసులో 2వ స్థానంలోకి వివేక్‌ రామస్వామి.. తొలిస్థానం ఎవరిదో తెలుసా..?

-

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో వివేక్‌ రామస్వామి దూసుకెళ్తున్నారు. తన ప్రసంగాలతో.. ఐడియాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కేవలం ఓటర్లనే కాదు పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖుల మద్దతును కూడా మూటగట్టుకుంటున్నారు. మరోవైపు తాను అధికారంలోకి వస్తే అమెరికాకు మేలు చేసే చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటానని బల్లి గుద్ది చెబుతున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థిత్వ రేసులో వివేక్.. ట్రంప్‌ తర్వాతి స్థానంలోకి చేరుకొన్నారు. ఇటీవల నిర్వహించిన జీవోపీ పోల్స్‌లో ఈ విషయం వెల్లడైంది.

ఈ పోల్స్ ప్రకారం.. రామస్వామి మూడోస్థానం నుంచి ద్వితీయస్థానానికి ఎగబాకినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఈ రేసు కోసం జరుగుతున్న ప్రాథమిక పోల్స్‌లో 39 శాతం మంది మద్దతుతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రథమస్థానంలో.. 13 శాతం మద్దతుతో వివేక్‌ రామస్వామి ద్వితీయస్థానానంలో.. భారత సంతతికి చెందిన మహిళా అభ్యర్థి నిక్కీహెలీ 12 శాతం ఓట్లతో తృతీయ స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ట్రంప్‌కు ప్రధాన పోటీదారుగా ఉన్న ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డీశాంటిస్‌ రెండు స్థానాలు దిగజారి.. అయిదో స్థానానికి పడిపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version