సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో ఆఫ్రికా ప్రతినిధులతో వాగ్నర్ బాస్ భేటీ

-

రష్యాపై తిరుగుబాటు చేసి ఆ తర్వాత కాంప్రమైజ్ అయి అజ్ఞాతంలోకి వెళ్లిన వాగ్నర్ బాస్ ప్రిగోజిన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రిగోజిన్ క్రెమ్లిన్‌ వ్యవహారాల్లో ఇంకా కీలకంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లో నిర్వహించిన రష్యా ఆఫ్రికన్‌ సదస్సు సమయంలో ఆఫ్రికా దౌత్య ప్రతినిధులతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో కనిపించిన ఫొటోలను ఓ ఆంగ్ల వార్తా సంస్థ ప్రచురించింది.

సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లోని ట్రెజినలి ప్యాలెస్‌ హోటల్‌లో ప్రిగోజిన్‌ సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు.  గతంలో వాగ్నర్‌ గ్రూపు ఈ హోటల్‌లో ఓ కార్యాలయం నిర్వహించిందని నిపుణులు చెబుతున్నారు. తిరుగుబాటు తర్వాత రష్యా భద్రతా దళాలు జులై 6న తనిఖీలు నిర్వహించిన కార్యాలయాల్లో ఇది కూడా ఉందని తెలిపారు. సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌లో వాగ్నర్‌ చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తోందని.. దీంతోపాటు లిబియా, మోజాంబిక్‌, ఉక్రెయిన్‌, సిరియా, సూడాన్‌లలో ఈ గ్రూపు కదలికలున్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version