శ్రీలంక ప్రధాని ఇంట్లో యువకుల WWE.. వీడియో వైరల్

-

ద్వీపదేశం శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమ్‌ సింఘే రాజీనామా చేశారు. ఇప్పటికే ఆందోళనతో శ్రీలంక అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో ఆందోళన కారులను కట్టడిచేసేందుకు లంక ఆర్మీ టీయర్‌ గ్యాస్‌ను ప్రయోగించింద. ఇదిలా ఉంటే.. మరో వైపు రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో కొలంబోకు తరలివచ్చిన ఆందోళనకారులు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికార నివాసాన్ని ముట్టడించారు.

నిరసన కారులు శ్రీలంక జండాలు చేబూని హెల్మెట్ లు పెట్టుకుని ఆందోళనలో పాల్గొన్నారు. అనేక మంది శ్రీలంక సైనిక సిబ్బంది కూడా అధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసనకారులతో చేరారు.నిరసన కారులను కట్టడి చేసేందుకు పోలీసులు గాలులోకి కాల్పులు జరిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో నిరసన కారుల నుండి తప్పించుకునేందుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన నివాసం నుండి పరారయినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.

అయితే అధ్యక్ష భవనం లోకి చొచ్చుకు వెళ్లిన ఆందోళనకారులు కిచెన్ లో ఆహార పదార్థాలు తింటూ, స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ చేస్తూ, జిమ్ రూములో జిమ్ చేస్తూ సందడి చేశారు. మూడు రోజులుగా అధ్యక్ష భవనమే వారికి నివాసంగా మారింది. బెడ్ రూమ్ లోని బెడ్ పై WWE ఫన్నీ ఫైట్ చేస్తూ యువకులు సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version