తెలంగాణాలో కొన్ని చోట్ల ఇంటర్నెట్ బంద్…!

-

ఆదివారం రాత్రి అదిలాబాద్ జిల్లాలో భైంసాలో మత ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలలో దాదాపు 11 మంది తీవ్రంగా గాయపడగా, పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అల్లర్లు విస్తరించే అవకాశం ఉండటంతో,

తెలంగాణాలో కొన్ని చోట్ల ఇంటర్నెట్ ని ప్రభుత్వం ఆపేసింది. మత ఘర్షణలు విస్తరించే అవకాశం ఉందని, మరిన్ని ప్రాంతాల్లో హింస జరిగే అవకాశాలు ఉన్నాయని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనలో కొన్ని వాహనాలను తగులబెట్టి, ఇళ్లపై కొందరు దాడులకు దిగారు.

ఇప్పటికే అధికారులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేశారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ సెక్షన్ అమలులో ఉన్నట్టు తెలుస్తుంది. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల్ని అధికారులు నిలిపివేశారు. ఈ నెల 16వ తేదీ వరకు ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ కాబోవని, ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కస్టమర్లకు టెలికాం సంస్థలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version