మద్యం మత్తులో యువతి హల్చల్.. ఇద్దరు యువకుల మధ్యలో!

-

మద్యం మత్తులో ఓ యువతి హల్చల్ చేసింది. ఫుల్లుగా మద్యం సేవించిన సదరు యువతి ఈ లోకాన్ని మరిచింది. రన్నింగ్ బైకు మీద ఇద్దరు యువకుల మధ్యలో బైకు మీద నిల్చుని నానా హంగామా చేసింది.

ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లోని భోపాల్లో ఆలస్యంగా వెలుగుచూసింది. మద్యం మత్తులో యువతీ యువకులు రోడ్డు మీద హల్చల్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్యం మత్తులో బైకును వేగంగా నడపడమే కాకుండా తోటి వాహదారులకు ఇబ్బంది కలిగించినట్లు ఆ వీడియోలో తెలుస్తోంది. రోడ్డు మీద వెళ్తున్న వారికి ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ గట్టిగా అరుస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించినట్లు తెలిసింది. ఈ వీడియోను కొందరు నెట్టింట షేర్ చేసి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news