ఇది వరకు చిన్న చితక గంజాయి కేసులే నమోదయ్యేవి హైదరాబాద్ లో. ఇప్పుడు ఏకంగా గంజాయి కంటే డ్రగ్స్ కేసు లు ఎక్కువగా నమోదవుతున్నాయి. అలాగే కేసు లో పట్టు బడిన వారు ఏ ఆఫ్రికన్ దేశానికి చెందిన వాడో అయి ఉండేవాడు కానీ ఇప్పుడు లోకల్ గానే ముఠాలుగా
ఏర్పడి డ్రగ్స్ తాయారు చేసి అమ్ముతున్నారు. డ్రగ్స్ వినియోగం లో గోవా ఢిల్లీ తర్వాత మన హైదరాబాద్ 3 వ స్థానం లో ఉంది అంటే అతిశయోక్తి కాదు. ప్రతి చిన్న పార్టీలో డ్రగ్స్ వాడకం కామన్ అయిపోయింది . పబ్ లు బార్లు రేస్తారెంట్ లు ఫార్మ్హౌస్ రిసార్ట్ లల్లో ఇలా అనేక చోట్ల డ్రగ్స్ కల్చర్ కొనసాగుతుంది . పుట్టిన రోజు వేడుకలు ,న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఇలా ఎదో పార్టీ ఉంటె చాలు డ్రగ్స్ ని ఎదో ఒక రూపం లో వాడేస్తున్నారు కుర్రకారు. అది లేకపోతే నామోషీగా ఫీల్ అవుతున్నారు . దీంతో చాల మంది మత్తుకు బానిసలవుతున్నారు. కొందరేమో అది వాళ్ళ స్టేటస్ సింబల్ గా ఫీల్ అవుతున్నారు . ఒక్క మాటలో చెప్పాలంటే డ్రగ్స్ వాడకం ఇప్పుడు ఒక నయా ట్రెండ్ .
గంజాయి తో పాటు కొకైన్ ,హెరాయిన్ ,చరస్ ,ఎఫ్రాదిం తదితర మత్తు పదార్థాలు ఈ నగరం లో కామన్ గా దొరుకుతున్నాయి . ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలకు నగరం అంత సిద్ధం చేస్తున్నారు. దీంతో డ్రగ్స్ మాఫియా దాని ఫై కన్నేసింది. తక్కువ సమయం లో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు అని న్యూ ఇయర్ ని టార్గెట్ చేసింది .యువత ను మత్తులో ముంచుతూ వాళ్ళ నుండి డబ్బులు గుంజుదామని చూస్తున్నారు .
గోవా కాశ్మీర్ వివిధ ప్రాంతాల నుంచి మత్తు పదార్థాలు తెచ్చి అమ్మాలని చూస్తున్నారు . ఇప్పటికే చాల ముఠాలను అరెస్ట్ చేశారు అధికారులు . నగర శివార్లలో లోకల్ మేడ్ గా తాయారు చేసి వీలైనన్ని ఎక్కువగా అమ్మి కోట్లు గడించాలని పక్క ప్లాన్ వేస్తున్నారు .ఎలాంటి వారికి పాత మూత బడ్డ కార్మాగారాలు అడ్డాగా మారుతున్నాయి .అందులోని ల్యాబ్ లలో కొత్త రకం మాదక ద్రవ్యాలను తాయారు చేసి యూత్ మీదికి వదులుతున్నారు . దీంతో మత్తులో పడి యూత్ ,విద్యార్థులు తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు