మరి కాసేపట్లో మోడీతో జగన్ భేటీ.. చేరిక వార్తలతో ఉత్కంట !

-

నేడు ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశం కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి అనేదే ప్రధాన అజెండా అని చేబుతోన్నా నిన్నటి నుండి వైసీపీ ఎన్డీఏలో చేరుతుందని జరుగుతోన్న ప్రచారం నేపధ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుండు. ఉదయం 10.30 కు ప్రధాని అధికార నివాసమైన “లోక్ కళ్యాణ్ మార్గ్” లో ఈ సమావేశం జరగనుంది.

ముఖ్యమంత్రి వెంట వైసీపీ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మార్గాని భరత్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావులు ఉన్నారు. ఇక ఏపీ సీఎంఓ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ప్రధానితో సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు, అందించాల్సిన సహాయం, విభజన హామీలు, తదితర 17 అంశాలపై చర్చ జరగనుందని అంటున్నారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు “అపెక్స్ కౌన్సిల్” వీడియో సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఢిల్లీలోని ఏపీ సీఎం అధికారిక నివాసం నుంచి “అపెక్స్ కౌన్సిల్” వీడియో సమావేశంలో పాల్గొననున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version