సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. దశాబ్దకాలంగా చిత్రసీమలో హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ లక్కీ బ్యూటీ.. ఓ వైపు సినిమాల్లో నటిస్తునే మరోవైపు బిజినెస్ రంగంలోనూ రాణిస్తోంది. ఇక సోషల్‌మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్‌తో కనిపించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అలాగే ఫిట్‌నెస్‌కు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుందీ అమ్మడు. ప్రస్తుతం తెలుగులో కాస్త జోరు తగ్గించినా హిందీలో మాత్రం ఫుల్ బిజీగా గడుపుతోంది. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం…
ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా వెలుగుతున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. చిన్న హీరోలు, స్టార్ హీరోలు అని తేడా లేకుండా అందరితో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విజయవంతమైన చిత్రాల్లో నటించి యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం గ్లామర్ పాత్రల నుంచి వైవిధ్యమైన పాత్రల వైపు అడుగులేస్తోంది.
అయితే ఈ అమ్మడు దిల్లీలోని సిక్ కుటుంబంలో జన్మించింది. అయినా పదహారణాల తెలుగు ఆడపడుచులా తన అందం,నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. 2011లో ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన రకుల్.. ఆ తర్వాత ఫెమినా మిస్ ఫ్రెష్ ఫేస్, ఫెమినా మిస్ టాలెంటడ్, ఫెమినా మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ సొంతం చేసుకుంది. 18ఏళ్ల వయసులో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. అప్పుడే నటి అవ్వాలని నిర్ణయించుకుంది.
2009లో కన్నడ సినిమా గిల్లితో వెండితెర అరంగేట్రం చేసింది. అయితే తొలి సినిమా పాకెట్ మనీ కోసం చేసినట్లు చెప్పింది. గతంలో ఓ సందర్భంగా తన మొదటి సంపాదనతో కారు కొనినట్లు తెలిపింది. ఆ తర్వాత కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అలా అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రఫ్, లౌక్యం, కరెంట్‌తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్2, స్పైడర్, మన్మథుడు 2 ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో కొండపొలంలో మూవీలో తాను చేసిన డీగ్లామర్ రోల్ మర్చిపోలేని అనుభూతినిచ్చిందని ఓ సారి చెప్పింది.
కెరీర్ ప్రారంభం నుంచే తెలుగు సినిమాలు చేస్తూనే హిందీలో అదృష్టం పరీక్షించుకుంది. 2013లో యారియన్ చిత్రంతో బాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత అయ్యారి, దేదే ప్యార్ దే, సర్దార్ కా గ్రాండ్ సన్ వంటి సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్లో కాస్త జోరు తగ్గించి పూర్తిగా బీటౌన్‌పై ఫోకస్ పెట్టి అక్కడి స్టార్ హీరోలతో నటించడం ప్రారంభించింది. అలా అటాక్, రన్‌వే 34, డాక్టర్ జి, థ్యాంక్ గాడ్, కట్పట్లీ చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం ఈ అమ్మడు ఛత్రివాలీ, మేరీ పత్నీ కా రీమేక్, ఇండియన్ 2, 31 అక్టోబర్ లేడీస్ నైట్ చిత్రాల్లో నటిస్తోంది. ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న కసరత్తులు చేసే విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపదు. ఎక్కడు ఉన్నా ఎక్సర్సైజులు చేస్త ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అలా ఫిట్‌నెస్ బ్యూటీగా పేరు గాంచింది. జిమ్ మాత్రమే కాదు.. ఏరోబిక్స్, యోగా కూడా చేస్తుంది.
ఇక మరోవైపు బిజినెస్ రంగంలోనూ రాణిస్తోంది. జిమ్ సెంటర్లను నిర్వహిస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోనూ ‘ఎఫ్ 45’ పేరుతో అత్యాధునిక జిమ్‌ను ఏర్పాటు చేసింది. దిల్ హై దీవానా, నా దూజ కోయి, మషూక వంటి మ్యుజిక్ ఆల్బమ్ వీడియోస్లోను మెరిసింది. లౌక్యం, నాన్నకు ప్రేమతో చిత్రాలను ఉత్తమ నటిగా అవార్డులను అందుకుంది.
ఇక గ్లామర్, ఫిట్‌నెస్ సీక్రెట్ గురించి చెప్పింది. జ్యూస్ కంటే కూడా డైరెక్ట్‌గా పండ్లు తినడమే తనకు ఇష్టమని చెప్పింది. అలా అయితేనే, వాటిలోని పోషకాలు పూర్తిగా అందుతాయని అదే గ్లామర్, ఫిట్‌నెస్ రహస్యం అని వెల్లడించింది. గుజరాతీ థాలీ, గులాబ్ జామూన్, ఆలూ పరాటా తన ఫేవరెట్ ఫుడ్. స్టార్ హోటల్స్‌తో పోలిస్తే.. ఇంటి భోజనానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందట. ప్రస్తుతం ఈ అమ్మడు నటుడు జాకీ భగ్నానీతో రిలేషన్షిప్లో ఉంది. త్వరలోనే అతడిని పెళ్లి చేసుకోనుంది.