తమిళనాడులో కొత్త రాజకీయం.. ఉద్దండులు లేకుండా తొలిసారి

-

తమిళనాడులో మొట్ట మొదటి సారిగా జయలలిత, కరుణానిధి లేకుండానే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొలిసారి అమ్మ లేకుండానే అన్నాడీఎంకే ఎన్నికల బరిలోకి దిగుతుండగా, తొలిసారి కరుణానిధి లేకుండా ఎన్నికల బరిలో డీఎంకే దిగుతోంది. తమిళనాడు అధికార పార్టీ ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉంది. గ్రూపు రాజకీయాలతో వరుస వివాదాలు పార్టీని చుట్టుముట్టాయి. పైకి బానే కనిపిస్తోన్నా పన్నీరు, పళని మధ్య ఆధిపత్య పోరు చల్లారడం లేదు. జయ మరణం నుంచి ఈ కష్టాలు మొదలైనట్టు చెప్పచ్చు, అమ్మ లేని లోటును నేతలు భర్తీ చేయగలరా ? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. అయినా సరే అన్నాడీఎంకే మాత్రం అమ్మ సెంటిమెంట్‌నే నమ్ముకుంది.

అయితే జయలలిత లేని అన్నాడీఎంకేను ప్రజలు జీర్ణించుకుంటారా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అన్నాడీఎంకే తమిళ ప్రజల మనుసు గెలుస్తుందా..? లేదా డీఎంకేను తట్టుకొని నిలబడుతుందా..? అనేది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కళైంగర్‌ వారసుడిగా స్టాలిన్‌ నిరూపించుకుంటారా..? అనేది కూడా ఆసక్తికరమే. కరుణానిధి బాటలోనే నడుస్తున్న స్టాలిన్‌ తమిళనాడుపై కేంద్రం పెత్తనం చేస్తోందంటూ విమర్శలు చేస్తూ మళ్లీ తెరపైకి హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని తెచ్చారు. ఇదే తమకు అధికారం కట్టబెడుతుందని నమ్మకంతో ఉన్నారు. ఇక శశికళ వర్గం కూడా బీజేపీ సపోర్ట్ తో చక్రం తిప్పాలని చూస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో ?

Read more RELATED
Recommended to you

Exit mobile version