IPL 2021: ఐపీఎల్ హంగామా మ‌ళ్లీ షురూ.. ఇవాళ ముంబైతో చెన్నై ఢీ !

-

IPL 2021: క్రికెట్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ హంగామా మళ్లీ షురూ కానున్న‌ది. క్రికెట్ ల‌వ‌ర్స్ మ‌దిని దోచినా ఐపీఎల్ .. ఏడాది తిరక్కుండానే మూడోసారి ముందుకొచ్చింది. కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 14.. మళ్లీ నేటి నుంచి యూఏఈ వేదికగా కొనసాగనుంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదలైన 14వ‌ సీజ‌న్‌.. క‌రోనా వ‌ల్ల‌ అర్ధంత‌రంగా నిలిచిపోయింది. మూడు నెలల విరామం తర్వాత మ‌ళ్లీ క్రికెట్ ల‌వ‌ర్స్‌ను అలరించేందుకు సిద్ద‌మైంది. నేడు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ‌ధ్య పోరు సాగనున్న‌ది. ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్ లీగ్ ఫేజ్‌2 రీస్టార్ట్‌ అవుతోంది. మొదటి ఫేజ్‌లో భారత్‌లో 29 మ్యాచ్‌లు జ‌రిగాయి. నేటి నుంచి ప్రారంభ‌మైన ఐపీఎల్ రెండో ఫేజ్లో 27 రోజుల్లో 31 మ్యాచ్లు జరగనున్నాయి. ఫ‌స్ట్ ఫేజ్లో జోరు మీద ఉన్న జ‌ట్టు అదే జోరును కొనసాగిస్తాయా? ఏ ఏ జ‌ట్లు ప్లే ఆఫ్స్ లో నిలుస్తాయో వేచి చూడాలి.

ఇక.. చైన్నై, ముంబాయి మ‌ధ్య జ‌రిగే నేటి మ్యాచ్‌లో ఎవ‌రి బలాబ‌లాలు ఎలా ఉన్నాయో ఓ సారి ప‌రిశీలిస్తే.. ఇరు జ‌ట్టు చాలా బలంగా ఉన్నాయి. ముంబయి, చెన్నై జట్లు 32 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ముంబయి ఇండియన్స్ 19 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక ముంబయి ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలవగా.. చెన్నై జట్టు మూడు సార్లు టైటిల్ ను కైవ‌సం చేసుకుంది. పిచ్ విష‌యానికి వ‌స్తే… దుబాయ్ పిచ్ తొలుత పేసర్లకి.. ఆ తర్వాత స్పిన్నర్లికి అనుకూలించే అవకాశం ఉంది. దాంతో.. టాస్ గెలిచిన టీమ్ ఛేదనకే మొగ్గు చూపే సూచనలు కనిపిస్తున్నాయి.

షెడ్యూల్ ఇలా.. మొదటి క్వాలిఫైయర్ -1 మ్యాచ్ అక్టోబర్ 10న దుబాయ్ వేదికగా జరుగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ అక్టోబ‌ర్ 11, క్వాలిఫైయర్ -2 మ్యాచులు అక్టోబర్ 13న షార్జా వేదికగా జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా అక్టోబరు 15న జరుగనున్న‌ది.

ఈ సీజ‌న్‌లో దుబాయ్‌లో 13 మ్యాచ్‌లు, షార్జాలో 10 మ్యాచ్‌లు, అబుదాబిలో 8 మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఢిల్లీ టాప్‌లో ఉండ‌గా.. న్నై, బెంగళూరు, ముంబై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version