భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ కు క్రేజ్ బీభత్సంగా ఉంటుంది. ఇక భారత్ లో అయితే మాటాల్లో చెప్పలేం. కాగ ఐపీఎల్ 2022 కోసం క్రికెట్ అభిమానులు వేయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఐపీఎల్ 2022 ప్రారంభం కాబోతుంది. రేపటి నుంచి ఈ క్రేజీ లీగ్ ప్రారంభం అవుతుంది. కాగ ఈ లీగ్ లో ఫస్ట్ వార్.. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్త నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. రేపు సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
కాగ ఈ రెండు జట్ల గురించే చూస్తే.. గతంలో ఈ రెండు జట్లు 26 సార్లు ఢీ కొన్నాయి.
అందులో ఎక్కువ సార్లు అంటే 17 సార్లు చెన్నై విజయం సాధించింది. కోల్‌కత్త కేవలం 8 సార్లు మాత్రమే గెలుపొందింది. అలాగే ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. కాగ ఐపీఎల్ చరిత్రలో చెన్నై చేసిన భారీ స్కోర్ 220 గా ఉంది. అత్యల్ప స్కోర్.. 114 గా ఉంది. అలాగే కోల్‌కత్త అత్యధిక స్కోర్.. 202, అత్యల్ప స్కోర్.. 108 గా ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ :
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ నుంచి ధోని నుంచి తప్పుకున్నా.. ప్రతి మ్యాచ్ లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే జట్టులోకి కొత్తగా వచ్చిన డెవాన్ కాన్వేతో పాటు రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, మొయిన్ అలీ తో బ్యాటింగ్ విభాగం బలంగానే ఉంది. ముఖ్యంగా ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రోవో, దీపక్ చాహర్ సత్తా చాటే ఆటగాళ్లే. అలాగే బౌలింగ్ విభాగంలో ఆడమ్ మిల్నే, జోర్డన్ తో పాటు ఆల్ రౌండర్స్ తో కూడా అద్భతంగా ఉంది.
కోల్‌కత్త నైట్ రైడర్స్ :
కోల్‌కత్త నైట్ రైడర్స్ జట్టు ఈ సారి కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ తో బరిలోకి దిగుతుంది. ఆరోన్ ఫించ్, సునీల్ నరైన్, నితిష్ రానా, రహానే తోపాటు మరి కొందరితో బ్యాటింగ్ విభాగం బలంగానే ఉంది. అడ్రీ రస్సుల్, వెంకటేశ్ అయ్యార్ చెలరేగితే భారీ స్కోర్ అయినా చిన్నబోతుంది. అలాగే బౌలింగ్ విభాగంలో ప్యాట్ కమ్మిన్స్, మహ్మద్ నబీ, శివం మావీ, టీమ్ సౌతీ, ఉమేశ్ యాదవ్ తో పటిష్టంగా ఉంది.