రాజమౌళిని జైలులో వేయాలి…. బాలీవుడ్ క్రిటిక్ సంచలన వ్యాఖ్యలు

-

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మచ్ అవెయిట్ మూవీ ‘ ఆర్ఆర్ఆర్’. ఈరోజు భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ అయింది. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొదటి ఆట నుంచే తెగ హంగామా చేస్తున్నారు. మరోవైపు నార్త్ పీపుల్ నుంచి కూడా సూపర్ రివ్యూలు వస్తున్నాయి. రాజమౌళి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ అని రివ్యూలు ఇస్తున్నారు. 

ఇదిలా ఉంటే బాలీవుడ్ విమర్శకుడు కేఆర్కే మాత్రం భారతీయ సినీ చరిత్రలో అత్యంత చెత్త సినిమా తీసినందుకు డైరెక్టర్ రాజమౌళిని జైలులో వేయాలంటూ వ్యాఖ్యానించాడు. ప్రముఖ బాలీవుడ్ క్రిటక్ కేఆర్కే ‘ ఆర్ఆర్ఆర్’ ని తలాతోక లేని సౌత్ సినిమాగా అభివర్ణించారు. సినిమా చూసినందుకు తన నాలెడ్జ్ జీరో అయిందని అన్నాడు. ‘ తప్పు చెప్పలేను. కానీ, దేశ వీరులను చెత్త సినిమాతో పోల్చడం నేరం. రూ. 600 కోట్ల బడ్జెట్ తో స్క్రాప్ మూవీ తీసిని రాజమౌళిని 6 నెలలు జైల్లో పెట్టాలంటూ కేఆర్కే విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version