ఐపీఎల్ 2023: ఢిల్లీ ముందు కొండంత లక్ష్యం 224… చితక్కొట్టిన ఓపెనర్లు !

-

ఈ రోజు శనివారం కావడంతో ఐపీఎల్ షెడ్యూల్ లో డబుల్ ధమాకా జరుగుతుందని తెలిసిందే. అందులో భాగంగా మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ లు తలపడుతున్నాయి. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై… ఢిల్లీ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్ ను ఛేదించడం ఎంత కష్టమో ఢిల్లీ కి బాగా తెలుసు.. ఈ సీజన్ లో స్వల్ప లక్ష్యాలను సైతం చేధించలేక చతికిలపడిన ఢిల్లీ ఈ స్కోర్ ను చేరుకుంటుందా చూడాలి. కాగా ఈ మ్యాచ్ లో చెన్నై ఓపెనర్లు ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి మరీ పరుగులు సాధించారు. ఆరంభం నుండి దూకుడుగా ఆడిన ఋతురాజ్ గైక్వాడ్ మరియు కాన్ వే లు మొదటి వికెట్ కు 141 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మొదటి వికెట్ గా గైక్వాడ్ అవుట్ అయ్యాడు. ఇతని ఇన్నింగ్స్ లో 79 చేసిన పరుగులలో 7 సిక్సులు మరియు 3 ఫోర్లు ఉన్నాయి.

ఇక కాన్ వే (87, సిక్సులు 3 , ఫోర్లు 11 ) సైతం ఢిల్లీ బౌలర్లను చీల్చి చెండాడాడు, చెన్నై ఇంత స్కోర్ చేసిందంటే వీరిద్దరే కారణం… ఢిల్లీ బౌలర్లలో ఒక్కరిని కూడా వదలకుండా చితక్కొట్టారు. చివరి రెండు ఓవర్ లలో జడేజా (20) రాణించడంతో జట్టు స్కోర్ 223 పరుగులకు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version