ఈ రోజు లక్నో లో జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్ లో కే ఎల్ రాహుల్ మరియు డుప్లిసిస్ జట్లు తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన బెంగళూర్ కెప్టెన్ డుప్లిసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత మూడు మ్యాచ్ లుగా కెప్టెన్ గా కోహ్లీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ రోజు మ్యాచ్ కు డుప్లిసిస్ కెప్టెన్ గా తిరిగి రావడం శుభపరిణామం అని చెప్పాలి. కాగా ఈ పిచ్ మీద స్పిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే రాహుల్ తుది జట్టులో ఆవేశ్ ఖాన్ కు బదులుగా స్పిన్నర్ కృష్ణప్ప గౌతం ను తీసుకున్నారు, అలా లక్నో టీమ్ లో ఇప్పుడు రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా మరియు క్రునాల్ పాండ్య ల రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు.
ఐపిఎల్ 2023: RCB VS LSG మ్యాచ్ లో స్పిన్ కీలకం కానుందా !
-