నిన్న రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో చివరికి కోల్కతానే విజయం వరించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత ఓవర్ లలో 171 పరుగులు చేసింది. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన SRH చివరికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయి 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. చేధనలో మొదటి 6 ఓవర్ లలో మ్యాచ్ SRH వైపే ఉంది. కానీ ఆ తర్వాత వరుస వికెట్లను తీసి కోల్కతా మ్యాచ్ లోకి వచ్చింది. కానీ మద్యలో కెప్టెన్ మార్ క్రామ్ మరియు క్లాజెన్ లు దాదాపు గెలిపించినంత పని చేశారు. అయితే వరుసగా వీరిద్దరూ ఔట్ అవడంతో మళ్లీ మ్యాచ్ రసకందాయంలో పడింది. అలా గెలుపు ఓటముల మధ్య ఊగుతూ చివరి ఓవర్ వరకు మ్యాచ్ ను తీసుకువచ్చారు. కేవలం 6 బంతుల్లో 9 పరుగులు చేస్తే SRH విజయం సాధిస్తుంది.
ఐపీఎల్ 2023: SRH ఏందయ్యా ఇది.. గెలిచే అవకాశం ఉన్నా ఓడిపోయి విమర్శలపాలు !
-