ఐపీఎల్ 2024 :LSG జెర్సీలో దర్శనమిచ్చిన దేవదత్ పడిక్కల్

-

కర్ణాటక రాష్ట్రానికి చెందిన దేవదత్ పడిక్కల్ క్రికెటర్ గా ఎంతో టాలెంట్ ఉన్నా మంచి స్టేజ్ పైన అంచనాలకు తగినట్లు రాణించడంతో ఫెయిల్ అవుతున్నాడు. అందుకే ఇంకా జాతీయ జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. ఐపీఎల్ లో అడపాదడపా రాణిస్తున్న అది సరిపోవడం లేదు. గత ఐపీఎల్ వరకు పడిక్కల్ రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్నాడు. ఇక ఈ మధ్యనే కొత్త సీజన్ సమీపిస్తుండడంతో అటు రాజస్థాన్ మరియు లక్నో జట్ల యాజమన్యాలు కీలక నిర్ణయం తీసుకుని ఆటగాళ్లను స్వాప్ చేసుకుంది. ఇందులో భాగంగా రాజస్థాన్ ప్లేయర్ పడిక్కల్ లక్నో సూపర్ జెయింట్స్ కు వెళ్లగా, లక్నో ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్ రాజస్థాన్ కు బదిలీ అయ్యాడు.

ఇక తాజాగా పడిక్కల్ లక్నో జెర్సీ ధరించి ఫోటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, ఐపీఎల్ సీజన్ కు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నా అప్పుడే తెగ తొందరపడపోతున్నాడు పడిక్కల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version