ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గుంటూరులో జరిఇగిన వికసిత్ సంకల్ప్ యాత్ర సభకు ముఖ్య అతిధిగా వెళ్లడం జరిగింది. ఈ సభలో అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ… ప్రజల కోసం ఏ పథకాలను అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చారో… ఆ పథకాలు సక్రమంగా ప్రహాలకు చేరుతున్నాయా లేదా అన్నది చూసుకోవాలన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికీ పటహకాలు అందేలాగా చర్యలు తీసుకోవలసిన బాధ్యత ఉందన్నారు గవర్నర్. ఇంకా ఈ పథకాలలో ఏమైనా లోటు పట్లు ఉన్నాయేమో లబ్దిదారులను అడిగి తెలుసుకుని ఇంకా మిన్నగా అందించడానికి పలు మార్పులు చేసుకోవలసిన అవసరం ప్రభత్వం పైన ఉంది.
ఎప్పుడైతే ప్రజల కోసం వచ్చిన పథకాలు వారికి 100 శాతం చేరుతాయో అప్పుడే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సక్సెస్ అయినట్లు అంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ చాలా కీలక విషయాలను అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు తెలియచేశారు.