IPL 2024 : ప్యాట్ కమిన్స్‌ కాన్ఫిడెంట్ మాములుగా లేదుగా !

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ దూకుడైన ఆటతో ముందుకు వస్తామంటున్నాడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌. ఈ సీజన్ ను గెలుపుతో మొదలుపెట్టి శుభారంభంతో ఆరెంజ్‌ ఆర్మీని ఖుషీ చేస్తామని హామీ ఇచ్చారు.గత మూడు సంవత్సరాలుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న సన్ రైజర్స్ ఈసారి పలు మార్పులతో బరిలోకి దిగనుంది.బ్రియన్‌ లారా స్థానంలో న్యూజిలాండ్‌ దిగ్గజ స్పిన్నర్‌ డానియెల్‌ వెటోరిని హెడ్‌కోచ్‌గా నియమించింది. అదే విధంగా దక్షిణ ఆఫ్రికా స్టార్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్‌కు పగ్గాలు అప్పగించింది.మినీ వేలంలో ఏకంగా రూ. 20. 50 కోట్లకి సొంతం చేసుకుంది.

ఇక మార్చి 22న ఐపీఎల్ ప్రారంభం అవుతుండగ,మార్చి 23న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తో సన్‌రైజర్స్‌ పోటీ పడనుంది.ఈ నేపథ్యంలో కెప్టెన్‌ కమిన్స్‌ మాట్లాడుతూ.. ”శుభారంభం కోసం ఎదురు చూస్తున్నాం. దూకుడైన ఆటతో తాజా సీజన్‌ను ఆరంభించాలని చూస్తున్నాం అని అన్నారు. మా జట్టు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల సమ్మేళనం. భువీ ఉన్నాడు. గతేడాది మార్క్రమ్‌ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు అని గుర్తు చేశారు. వీరితో పాటు అభిషేక్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ వంటి ఆటగాళ్లు ఉన్నారు.కొత్త సభ్యులతో కలిసి ఐపీఎల్‌ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news