IPL 2024 : పీకల్లోతు కష్టాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు జరగనున్న క్వాలిఫైయర్-1లో సన్ రైజర్స్ హైదరాబాద్ , కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తడబడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ లో ఓపెనర్లు హెడ్ (0), అభిషేక్ (3)తో పాటు నితీశ్ (9), షాబాజ్(0) ఘోరంగా విఫలమయ్యారు. 5 ఓవర్లకే 39 రన్స్ చేసిన హైదరాబాద్ 4 కీలక వికెట్లు కోల్పోయింది.

దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేస్తుందనే అంచనాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. అభిమానుల ఆశలన్నీ క్లాసెన్పైనే ఉన్నాయి. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ ఎయిట్ ఓవర్లలో 4 నష్టానికి 50 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాటి 18 బంతుల్లో 26 పరుగుల చేయగా, క్లాసేన్ 8 బంతుల్లో 8 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news