IPL 2024 : ఐపీఎల్ చరిత్రలోనే భారీ స్కోర్ చేసిన చేసిన సన్రైజర్స్.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే ?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే సన్రైజర్స్ అత్యధిక స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. దళిత బ్యాటింగ్ ఆరంభించిన సన్రైజర్స్ బ్యాటర్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను ఓ రేంజ్ లో ఆటాడుకున్నారు.ఈ ఏడాదే ముంబైపై 277 రన్స్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ , ఆ రికార్డును బద్దలుకొట్టింది కమిన్స్ సేన. హెడ్, క్లాసెన్ వీర విహారంతో బెంగళూరు బౌలర్లు తేలిపోయారు.

కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్, ఆ తర్వాత కూడా సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడి 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 8 సిక్సర్లు, 9 ఫోర్లతో వీర విహారం చేశాడు.మరో ఓపేనర్ అభిషేక్ 22 బంతుల్లో 34 పరుగులు చేశారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. క్లాసేన్ 67 పరుగులు, మార్కరం 32, సామద్ 37 పరుగులు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version