IPL 2024 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఇవాళ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్, రాజస్థాన్ మధ్య మరో రసవత్తర పోరు జరగనుంది. ఇక ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్ 7:30 pm గంటలకు ప్రారంభం కానుంది.ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 18 మ్యాచులు జరగ్గా.. చెరో తొమ్మిది మ్యాచుల్లో విజయం సాధించాయి. టేబుల్ టాపర్ గా ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు టాపార్డర్ భీకరమైన ఫామ్లో ఉంది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ నిలదొక్కుకుంటే హోంటీమ్కు అడ్డే ఉండదు. ఈ క్రమంలో టాపార్డర్ తిరిగి ఫామ్లోకి వచ్చి సన్రైజర్స్ గెలుపు బాట పట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్ : ట్రావిస్ హెడ్, అభిషేక్, అన్మోల్ ప్రీత్, క్లాసెన్, నితీష్ రెడ్డి, సమద్, షాబాజ్, జాన్సెన్, పాట్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్ : జైస్వాల్, శాంసన్, పరాగ్, జురెల్, పావెల్, హెట్మెయర్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, చాహల్, సందీప్ శర్మ

Read more RELATED
Recommended to you

Exit mobile version